Harish Rao : అదానీతో చీకటి ఒప్పందాల సంగతేంటి..? హరీశ్ ఫైర్

Harish Rao : అదానీతో చీకటి ఒప్పందాల సంగతేంటి..? హరీశ్ ఫైర్
X

యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి గౌతమ్ అదానీ ఇచ్చిన విరాళాన్ని నిరాకరిస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై మాజీ మంత్రి హరీశ్ రావు ఘాటుగా స్పందించారు. స్కిల్ వర్సిటీకి ఆదానీ ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సరే.. మరి దావోస్ లో అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి? ప్రశ్నించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీ అవినీతి మీద పోరాటం చేస్తుంటే రేవంత్ అదానీతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. విద్యుత్ డిస్కంలను అదానీ కంపెనీకి కట్టబెట్టే సంగతిపై కూడా రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు. అదానీ కంపెనీపై అవినీతి బయటకు రాగానే ఇప్పుడు మాట మారుస్తున్నారని, కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అధికారంలో ఉన్నపుడు 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడతామని అదానీ గ్రూప్ ముందుకు వస్తే.. నిర్మొహమాటంగా తిరస్కరించామన్నారు

Tags

Next Story