KTR : బాండ్ పేపర్ హామీలు ఏమైనయ్ : కేటీఆర్

'ఎన్నికల్లో గెలిచేందుకు భట్టి విక్రమార్క ప్రజలకు తప్పుడు హామీలిచ్చారు.. బాండ్ పేపర్లు రాసి దేవుని గుడిలో పెట్టి ఎన్నికల్లో గెలిచిన భట్టి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి. బాండ్ పేపర్ల హామీలు ఏడాది దాటిన కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులున్నా చేసింది శూన్యం. జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం సి గ్గుచేటు' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్అన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల పరిధిలోని మిట్టపల్లిలో డీసీఎంఎస్ మాజీ చైర్మన్ రాయల వెంకట శేషగిరి కాంస్య విగ్రహావిష్కరణకు చీఫ్ గెస్ట్ గా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాయ మాటలు విని రాష్ట్రప్రజలంతా మోసపోయారని, ఇప్పుడిప్పుడే ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఢిల్లీ వెళ్తే దొంగల్లా చూస్తున్నారన్న రేవంత్ ను .. దొంగను దొంగలా చూడకపోతే ఎలా చూస్తా రని విమర్శించారు.
ఉన్న పథకాలను ఎత్తి వే స్తున్న ప్రభుత్వం కొత్త స్కీంలను ఎలా అమలు చేస్తుంది. కేసీఆర్ కిట్, రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్ పెంపు ఇలా ఎన్నో పథకాలు ఆగిపోయాయి. మార్పు కోసం కాంగ్రెస్ పార్టీకి అధికార మిస్తే ప్రజల్లో ఎలాంటి మార్పు వచ్చిందో గమనించాలి. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులు కడితే ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం సీతారామ నీళ్లు నెత్తిన చల్లుకున్నారే తప్ప.. చుక్క నీరివ్వలేదు. కాంగ్రెస్ మాటలు విని రాష్ట్ర ప్రజలు మోసపోయాం.. ఐదేండ్లు దీని ఫలితం అనుభవించాల్సిందే. రానున్న స్థానిక సంస్థల ఎన్ని కల్లో కాంగ్రెస్ కు దిమ్మతిరిగే షాక్ ఇవాలి.. ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వ వ్యతిరేకత చాటాలి. భద్రాచలంలో ఎమ్మెల్యే ఎన్నికకు ఉపఎన్నిక తప్పదు. గెలిపించుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి. ఎప్పటికి తెలంగాణ ప్రజలకు గులాబీ పార్టీనే అండ ఉంటుంది.' అని కేటీఆర్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com