MLA KR Nagaraju : సభ కోసం చెరువులను పూడ్చితే మీరేం చేస్తున్నారు.. ఎమ్మెల్యే ఫైర్

MLA KR Nagaraju : సభ కోసం చెరువులను పూడ్చితే మీరేం చేస్తున్నారు.. ఎమ్మెల్యే ఫైర్
X

బీఆర్ఎస్ రజతోత్సవ సభ పేరుతో రైతుల కెనాళ్లను పూడ్చితే మీరేం చేస్తున్నట్టు.. అధికారులంతా కళ్లు మూసుకొని పనిచేస్తున్నారా? వేలాది ట్రిప్పుల మొరాన్ని ఎవరి పర్మిషన్ లేకుండా లేదా ఇక్కడికి తెస్తున్నారు? వాగులు, కెనాళ్ల పూడ్చుతూ చెరువులను కొల్ల గొడుతున్న.. మీకు పట్టింపు లేదా? అని వర్ధ న్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ఆఫీసర్లపై అగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ సభ కోసం ఎల్కతుర్తి పెద్దవాగు, దేవాదుల కెనాళ్లను పూడ్చే సిన విషయమై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు ఎల్కతుర్తి పెద్దవాగు, దేవాదుల కెనాళ్లను ఇవాళ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పరిశీలించారు. ఈ మేరకు కలెక్టర్ ప్రావీణ్య, ఆర్డీవో రాథోడ్ రమేశ్, మైనింగ్ ఆఫీసర్లతో ఫోన్ లో మాట్లాడారు. సభ పేరిట అనుమతులు లేకుండా గెట్లు తొలగించి, వాగులు, కెనాళ్లు పూడ్చారని, బాధ్యులను వెంటనే సస్పెన్షనే చేయాలని అధికారులను ఆదేశించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తన నియోజక వర్గంలోని ఓ క్వారీ ఓనర్ ను బెదిరించి సభకు రూ. 50 లక్షలు డిమాండ్ చేశారని ఎమ్మెల్యే నాగరాజు ఆరోపించారు.

Tags

Next Story