BJP State Chief : రాహుల్ గాంధీది ఏ కులం : బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు

రాహుల్ గాంధీది ఏ కులం అని బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు ప్రశ్నించారు. రాహుల్ తాత ఒక పర్షియన్ అని ఆయన మాత్రం బ్రాహ్మిణ్ అని చెప్పుకుంటారని అన్నారు. ఇంతకూ ఆయనకు గాయత్రీ మంత్రం వచ్చా..? అని ప్రశ్నించారు. ఆయన బ్రాహ్మణుడెలా అవుతారని అన్నారు. సీఎం రేవంత్ మంచి యాక్టర్ అని, ఆయనకు ఆస్కార్ అవార్డు కాదు.. అత్తారింటికి దారేది సినిమాలో మాదిరిగా భాస్కర్ అవార్డు ఇవ్వాలని అన్నారు. నోబుల్ ప్రైజ్ కాదు గ్లోబల్ ప్రైజ్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. మోదీని కన్వర్షన్ బీసీ అనటం వెనుకబడిన కులాలను అవమానించడమేనని అన్నారు. దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలనడంపై రేవంత్ కు థాంక్యూ చెప్పారు బీజేపీ స్టేట్ చీఫ్. తాము కూడా తెలంగాణ సీఎంను బీసీని చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందే బీజేపీ ప్రభుత్వమని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు పెట్టకుండా ఆర్డినెన్స్ తేవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. కులగణన రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. మిగతా కులాల లెక్కలు ఎందుకు ఇవ్వడం లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ షాడో బాక్సింగ్ చేస్తున్నాయని అన్నారు. బీజేపీకి మీడియాలో స్పేస్ దొరకకుండా రెండు పార్టీలు నాటకాలాడుతున్నాయని విమర్శించారు. పార్టీ తరఫున 42% రిజర్వేషన్లు ఇస్తం తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని రాంచందర్ రావుకుండబద్దలు కొట్టారు. పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తనపై చేసిన వ్యాఖ్యలపై కోర్టుకి వెళ్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజ ర్వేషన్లు కల్పించని పక్షంలో తాము పార్టీగా టికెట్లు ఇస్తామని చెప్పారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com