Konda Surekha : అసలు కొండా సురేఖ ఏమన్నారంటే?

వరంగల్ లోని కృష్ణా కాలనీలో బాలికల జూని యర్ కళాశాల భవన నిర్మాణానికి ఇటీవల భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి.. కార్పొ రేట్ సామాజిక బాధ్యత కింద రూ.4.5 కోట్లతో భవనం నిర్మించేందుకు అరబిందో ఫార్మా కంపెనీ ముందుకు వచ్చిందని తెలి పారు. ఈ క్రమంలోనే 'అనుమతుల కోసం కొన్ని దస్త్రాలు మంత్రుల వద్దకు వస్తుంటా యి. అలాంటి ఫైళ్లు వచ్చినప్పుడు సాధార ణంగా మంత్రులు డబ్బులు తీసుకుని క్లియరెన్స్ ఇస్తుంటారు. మేము మాత్రం మాకు రూపాయి అవసరం లేదు. స్కూల్ను అభివృద్ధి చేస్తే చాలు' అని కోరాం అని ఆమె వ్యాఖ్యానించారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో తాజాగా వివరణ ఇచ్చారు. గవ ర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఒక్కో మెట్టు 5 ఎక్కి మంత్రిని అయ్యానన్నారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసే ఏ ఒక్కరినీ వదిలి పెట్టనని హెచ్చరించారు. గత ప్రభుత్వ పాల నపై బీఆర్ఎస్ నేతలు చర్చకు సిద్ధమా..? ఎక్కడికి వస్తారో రండి అంటూ సవాల్ విసిరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com