Azaruddin : కాంగ్రెస్ విడిచిపెట్టే ఉద్దేశంలో అజారుద్దీన్?

Azaruddin : కాంగ్రెస్ విడిచిపెట్టే ఉద్దేశంలో అజారుద్దీన్?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో (Telangana Congress Party) కీలక ముస్లిం నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ (Cricketer Azaruddin) రాజీనామాకు సిద్ధమవుతున్నారు. తెలంగాణలోని జూబ్లీహిల్స్ (Jubilee Hills) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన అజారుద్దీన్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ (Maaganti Gopinadh) చేతిలో ఓడిపోయారు. దాదాపు 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన అజారుద్దీన్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావించారు. మైనారిటీ కోటాలో ఎమ్మెల్సీకి మంత్రి పదవి వస్తుందని అజారుద్దీన్ ఆశించారు. ఈ విషయమై తన సన్నిహితులతో మాట్లాడారు. అయితే అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడానికి కాంగ్రెస్ నేతలు ఆసక్తి చూపలేదు. అజారుద్దీన్‌కు బదులుగా అమీర్ అలీఖాన్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడంపై అజారుద్దీన్ తన సన్నిహితుల వద్ద అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్న తనకు కనీసం అవకాశం కూడా ఇవ్వలేదని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

దాదాపు పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన తనకు మైనారిటీ కోటాలో మంత్రి పదవి దక్కవచ్చని అజారుద్దీన్ భావించారు. దురదృష్టవశాత్తు బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. ఈ నేపధ్యంలో తనకు మంత్రి పదవిని కట్టబెట్టడానికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తారని ఆయన భావించారు. ఈ కోణంలో పార్టీ అగ్రనేతలతో తనకున్న పరిచయాల ద్వారా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నాలుగు నెలలైనా గడవకముందే రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యం కావడంతో తన కోరిక నెరవేరుతుందని అజహరుద్దీన్ భావించారు. ఈ మేరకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కానీ తనకు బదులు మరో మైనార్టీ నేత అమీర్ అలీఖాన్ కు ఎమ్మెల్సీ ఇవ్వడంపై అజారుద్దీన్ మండిపడుతున్నారు. కనీసం తనకు న్యాయం చేయని పార్టీలో ఉండడం కంటే వెళ్లిపోవడమే మేలని ఆయన భావిస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. తనను కాదని, 18 ఏళ్లుగా పార్టీలో ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తికి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నించారు. ఏఐసీసీ పెద్దలతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. గవర్నర్ ఎమ్మెల్సీ కోటా ఇస్తామని పార్టీ నేతలు హామీ ఇచ్చారని, అయితే ఇవ్వకుండా మోసం చేశారని అజహరుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఇప్పుడు అజారుద్దీన్ అంశం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్సీ పదవులు కాంగ్రెస్ పార్టీలో ముసలం అయ్యే అవకాశం ఉందని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story