Jeevan Reddy : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ది ఏ పార్టీ? : జీవన్ రెడ్డి

జగిత్యాల ఎమ్మెల్యే ఏ పార్టీయో కూడా తనకు తెలియదని, సంజయ్ ఏ పార్టీ ఎమ్మెల్యేనో స్పీకర్ ను అడిగితే తెలుస్తోందని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. సీనియర్ నాయకుడిగా జగిత్యాల అభివృద్ధి పై పూర్తి అవగాహన ఉందని, ఇందులో భాగంగానే జగిత్యాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఆహ్వానించిన్నట్లుగా ఆయన తెలిపారు. అభివృద్ధికి నిధుల ఇస్తానని పొంగులేటి హామీ ఇచ్చారని చెప్పారన్నారు. ఇవాళ గాంధీభవన్ లో ఆయన మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు సామాజిక న్యాయం కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని, తెలంగాణలో చేపట్టిన కులగణన దేశానికే రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. కేంద్రం కూడా కులగణన చేయడం హర్షనీయ మన్నారు. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలు కేంద్రానికి లెటర్ రాసే విధంగా బీసీ నేత ఆర్ కృష్ణయ్య చొరవ తీసుకోవాలన్నారు. ' కుల గణన చేయడంతో బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని రాహుల్గాంధీ ఆలోచన. సీఎం రేవంత్ రెడ్డి కుల గణన చేసి మండలిలో, అసెంబ్లీలో ఆమోదం పొందేలా చేసి గవర్నర్ తోకేంద్రానికి పంపించడం జరిగింది. లీగల్ గా ఇబ్బందులు రాకుండా కేంద్ర ప్రభుత్వం ఆర్టి కల్ 9వ షెడ్యూల్ లో చేర్చాలి. దీని ప్రకారమే బలహీన వర్గాల విద్యార్థులకు, ఉద్యోగులకు 42 శాతం రిజర్వేషన్ అమలు అవుతుంది. ఇప్పుడు బంతి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది.' అని జీవన్ రెడ్డి అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com