Allu Arjun : బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ఏం చెయ్యాలి.. ఏం చెయ్యొద్దు..?

Allu Arjun : బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ ఏం చెయ్యాలి.. ఏం చెయ్యొద్దు..?
X

సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో మధ్యంతర బెయిల్ పై ఉన్న హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది. నాంపల్లి కోర్టు శుక్రవారం షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇచ్చింది. అల్లు అర్జున్ తరపు న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తొక్కిసలాటలో అల్లు అర్జున్ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ కారణం కాదని, సంఘటన జరిగిన ప్రాంతానికి, అల్లు అర్జున్ వచ్చిన ప్రాంతానికి 30 మీటర్లు దూరం ఉందని ఆధారాలు కోర్టుకు సమర్పించారు. అయితే, అల్లు అర్జున్ రావడం వలనే తోపులాట జరిగి, తొక్కిసలాట జరిగిందని పోలీసుల తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. అల్లు అర్జున్ రాకపోతే ఈ సంఘటన జరిగి ఉండేది కాదని, ఆయన పలుకుబడి ఉన్న వ్యక్తి అని బెయిల్ మంజూరు చేస్తే కేసు విచారణపై ప్రభావం చూపే అవకాశం ఉందని పీపీ వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది.

అల్లు అర్జును రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానం అందులో కొన్ని షరతులు విధించింది. తొలుత అల్లు అర్జునకు బెయిల్ మంజూరు చేస్తూ రూ. 50 వేలు, రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. సాక్షులను ఏ విధంగానూ ప్రభావితం చేయొద్దని సూచించింది. కేసును ప్రభావితం చేసేలా కామెంట్స్ చేయొద్దని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ముందు వ్యక్తిగతంగా విచారణ హాజరు కావాలని షరతు విధించింది. ఫైల్ లో సంతకం చేయాలని సూచించింది. అనుమతి లేనిదే నగరందాటి వెళ్లొద్దని సూచించింది.

Tags

Next Story