Hi-Tech City : హైటెక్ సిటీ పబ్స్‌పై కొరడా.. అనుమతుల్లేని వాటికి తాళాలు

హైదారాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పబ్స్ పై పోలీసులు కొరడా ఝుళిపించారు. ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మాదాపూర్‌లోని 17 పబ్బుల్లో లైసెన్సులను తనిఖీ చేశారు. పది పబ్బులు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నట్లు గుర్తించారు. వాటన్నింటికీ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపారు. పబ్బుల్లో సౌండ్ పొల్యూషన్ లైసెన్స్, పోలీస్ పర్మిషన్, జీహెచ్‌ఎంసీ పర్మిషన్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. పబ్బుల్లో మైనర్లకు అనుమతిచ్చి లిక్కర్ సప్లయ్ చేసే బార్లపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. అలాగే బార్లు, పబ్బుల్లో గంజాయి డ్రగ్స్ సరఫరీ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వీకెండ్ వస్తే మత్తు వల విసురుతున్నారని... ఇకనుంచి తమ ఆదేశాలు పక్కాగా పాటించాల్సిందేనని పోలీసులు పబ్స్ నిర్వాహకులకు తేల్చిచెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com