TG : పదవులు ఎవరికి.. రేవంత్ చుట్టూ నేతల ప్రదక్షిణలు

TG : పదవులు ఎవరికి.. రేవంత్ చుట్టూ నేతల ప్రదక్షిణలు
X

విదేశీ పర్యటన నుంచి హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ మెరుపులా పర్యటనలు చేస్తున్నారు. హైదరాబాద్-ఢిల్లీ-హైదరాబాద్ ఇలా రెండురోజులు గడిచిపోయింది. సౌత్ కొరియా నుంచి రాగానే గోల్కొండ, రాజ్ భవన్ లో ప్రోగ్రామ్స్ తర్వాత హడావుడిగా ఢిల్లీకి వెళ్లారు. పార్టీ పెద్దలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పీసీసీ చీఫ్ పై చర్చలు జరిపారు.

ఐతే.. కొత్త పీసీసీ చీఫ్ ఎవరనే దానిపై నిర్ణయాన్ని పెద్దలకే వదిలేశానన్న రేవంత్.. కేబినెట్ లో కొత్తవారికి ఛాన్స్ పై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో రాత్రి హైదరాబాద్ కు వచ్చిన రేవంత్ తో ఆశావాహులు భేటీ అయ్యేందుకు రెడీ అయ్యారు.

ఇటు మంత్రి పదవులు, రెండో విడత నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్న నేతలతో రేవంత్ కూడా ప్రత్యేకంగా సమావేశం అవ్వనున్నట్లు తెలుస్తోంది.

Tags

Next Story