Telangana : యూరియా కొరతకు కారణమెవరూ..? హరీశ్ రావు ప్రశ్న..

Telangana : యూరియా కొరతకు కారణమెవరూ..? హరీశ్ రావు ప్రశ్న..
X

తెలంగాణ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై కేంద్ర ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ మధ్య మాటల యుద్ధం మొదలైంది. దేశవ్యాప్తంగా ఎరువుల కొరత లేదని కేంద్రం ఒక పత్రికా ప్రకటన విడుదల చేయగా.. దీనిపై బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. తెలంగాణలో యూరియా కొరతకు ఎవరు కారణమంటూ ఆయన ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వ ప్రకటన

దేశంలో యూరియా కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీర్ఘకాలిక అవసరాలను తీర్చడానికి అంతర్జాతీయంగా ఒప్పందాలు జరుగుతున్నాయని, ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల లభ్యత సౌకర్యవంతంగా ఉందని తెలిపింది.

యూరియా: 143 LMT అవసరానికి గాను 183 LMT లభ్యత ఉంది, ఇందులో 155 LMT అమ్ముడయ్యాయి.

డీఏపీ: 45 LMT అవసరానికి గాను 49 LMT లభ్యత ఉంది, 33 LMT అమ్ముడయ్యాయి.

ఎన్‌పీకేలు: 58 LMT అవసరానికి గాను 97 LMT లభ్యత ఉంది, 64.5 LMT అమ్ముడయ్యాయి.

ఈ గణాంకాలను బట్టి చూస్తే దేశవ్యాప్తంగా ఎరువుల లభ్యతలో ఎలాంటి సమస్య లేదని కేంద్రం తేల్చి చెప్పింది.

కేంద్ర ప్రకటనపై హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘‘తెలంగాణలో యూరియా కొరతకు కారణం రేవంత్ రెడ్డి ప్రభుత్వమా లేక కేంద్రమా..? అని ఆయన ప్రశ్నించారు.

2025 ఆగస్టు 20 నాటికి గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే యూరియా అమ్మకాలు 13 LMTకి పైగా పెరిగాయని హరీశ్ రావు తెలిపారు. ఈ అమ్మకాల పెరుగుదల ఉన్నప్పటికీ, దేశవ్యాప్తంగా యూరియా నిరంతర లభ్యతను పెంచుతామని కేంద్రం స్పష్టం చేసిందని గుర్తుచేశారు.

కేంద్రం విడుదల చేసిన గణాంకాలు నిజమైతే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచడంలో పూర్తిగా విఫలమైనట్లేనని హరీశ్ రావు ఆరోపించారు. ఒకవేళ కేంద్రం అబద్ధం చెబుతుంటే, అది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని ఆయన విమర్శించారు. మొత్తానికి, యూరియా కొరత సమస్య ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది.

Tags

Next Story