Mahesh Kumar Goud : భారత్-పాక్ యుద్ధం మధ్యలో ట్రంప్ ఎవరు?

ఆపరేషన్ సిందూర్ లో కాల్పుల విరమణ వివాదాస్పదంగా మారుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే యుద్ధం ఎందుకు ఆపారని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. ట్రంప్ తలదూర్చేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. పాక్ పై యుద్ధంగా చేయలేక ట్రంప్ కు భయపడి విరమించుకు న్నారా..? అని ప్రశ్నించారు. ట్రంప్ చెప్తే కాల్పుల విరమణకు ఎందుకు ఒప్పుకున్నారో తెలుపకుండా రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం ఏమిటని ప్ర శ్నించారు. ఇందిరమ్మ అసలు సిసలు ఉక్కుమనిషి అన్నారు. రాహుల్ అడిగిన ప్రశ్నే రేవంత్ రెడ్డి అడుగుతున్నారని రాఫేల్ యుద్ధ విమానాలు ఎన్ని నష్ట పోయామో చెప్పాలని అన్నారు. మోదీ కాలం చెల్లిన వెయ్యి రూపాయల నోటు లాంటి వారని అన్నారు. ఆయనను మార్చే టైం వచ్చేసిందని అన్నారు.
కవిత, రాజాసింగ్ వ్యాఖ్యలను పోల్చి చూస్తే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తథ్యమని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో వాటాల కోసం పంచాయితీ మొదలైందని అన్నారు. నోటీసులు రాగానే కేసీఆర్, ఈటల రాజేందర్‌కి పాత బంధం మళ్లీ చిగురుచ్చిందని ఎద్దేవా చేశారు. కులసర్వే బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తోందని ఉద్ఘాటించారు. కాళేశ్వరం విషయంలో నోటీసులు రాగానే ...శామీర్‌పేటలోని ఓ ఫాంహౌస్‌లో మాజీ మంత్రి హరీష్‌రావుతో ఈటల రాజేందర్ సమావేశం అయ్యారని ఆరోపించారు మహేష్ కుమార్ గౌడ్.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com