BJP MP Dharmapuri : పేరు చెప్పడానికి భయమెందుకు కేటీఆర్ ? : ఎంపీ ధర్మపురి అర్వింద్

BJP MP Dharmapuri : పేరు చెప్పడానికి భయమెందుకు కేటీఆర్ ? : ఎంపీ ధర్మపురి అర్వింద్
X

కంచ గచ్చిబౌలి భూముల వెనుక ఉన్న ఆ ఎంపీ పేరు చెప్పడానికి కేటీఆర్ ఎందుకు భయపడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. ఏ బ్యాంకు లోన్ ఎంత? బయటపెట్టాలని సవాల్ విసిరారు. సీఎం రేవంత్ రెడ్డిని మార్చాలని కాంగ్రెస్ హైకమాండ్ చూస్తోందని అన్నారు. కేసీఆర్ పీకడానికి ప్రతిపక్ష హోదా తీసుకున్నారా! అని ఫైర్అయ్యారు. మంత్రి శ్రీధర్ బాబుకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందని.. కానీ ఆయనకు వసూలు చేయడం రాదన్నారు. అందుకే హైకమాండ్ వెనక్కి తగ్గుతోందని సెటైర్ వేశారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీసులో అర్వింద్ మాట్లాడుతూ ‘హెచ్సీయూ భూములపై మాట్లాడే అర్హత కేటీఆర్, కవిత లకు లేదు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉండి దాన్ని ఎందుకు అలోకేట్ చేయలేదు? రాష్ట్రంలో అసమర్థ, అవినీతి, చేతకాని ప్రభుత్వం నడుస్తోంది. డైవర్ట్ పాలిటిక్స్ తప్ప వాగ్దానాల అమలుపై చిత్తశుద్ధి లేదు. లంకె బిందెలు సచివాలయంలో కాదు ఫామ్ హౌస్ లో ఉంటాయి. రేవంత్.. దమ్ముంటే అక్కడికి వెళ్లు. కలెక్ట్.. కరోడ్.. పే అండ్ యూస్ పాలసీతో రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నాడు. మొన్ననే కొత్తగా ఇద్దరు ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్కా కొమురయ్య అడుగు పెట్టారు. ఇంకా నీవు మమ్మల్ని ఆపేది ఏంటి? ప్రజలు ఎవరు కేసీఆర్ ను యాది చేసుకోరు. అప్పటివరకు ఆయన ఉంటాడో పోతాడో తెల్వదు' అని అన్నారు.

Tags

Next Story