TG : సీఎం సోదరుడు ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

TG : సీఎం సోదరుడు ఇళ్లు ఎందుకు కూల్చడం లేదు? : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
X

రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిపోతోందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 9 నెలలు అవుతున్నా.. ఇప్పటికీ విద్య శాఖ మంత్రి లేరని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన కాదని, ప్రతికార పాలన అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్సుమెంట్స్ చెల్లించకపోవడంతో.. ఫీజులు కట్టడం లేదని యాజమాన్యాలు మెమోలు ఇవ్వడం లేదన్నారు. పేద విద్యార్థులు అంటే రేవంత్ రెడ్డికి కోపం ఎందుకో చెప్పాలని డిమాండ్ చేశారు. ఖైదీల తిండి కోసం రోజుకు రూ. 83 ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, విద్యార్థుల కోసం మాత్రం రూ. 37 మాత్రమే ఖర్చు చేస్తోందని చెప్పారు. మహబూబ్ నగర్‌లో పేదల ఇళ్లను కూల్చేసిన అధికారులు.. హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఇంటికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. పోలీసు బలంతో అంధుల కాలనీని కూల్చిన అధికారులు, అదే పోలీసులతో వెళ్లి తిరుపతి రెడ్డి ఇంటిని ఎందుకు కూల్చడం లేదో చెప్పాలన్నారు.

Tags

Next Story