TG : బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారా.. ఒవైసీ సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేస్తారని ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ( Asaduddin Owaisi ) కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనం కాకపోతే బీజేపీకి బీఆర్ఎస్ బయట నుంచి మద్దతిస్తుందని మీడియాలో ప్రచారం జరుగుతోందని చెప్పారు. ఈ వార్తలపై బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనని మాజీ ఎంపీ వినోద్ చేసిన వ్యాఖ్యలపై కూడా స్పష్టత ఇవ్వాలని ఒవైసీ కోరారు. తెలంగాణ వచ్చింది.. తెలంగాణ అభివృద్ధి చెందింది.. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి.. కానీ, ప్రశ్న ఏమిటంటే.. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుందా..? లేదా మద్దతిస్తుందా..? అనేది నాకు తెలియదు.. కాగా కొన్ని ప్రముఖ పత్రికలు వార్తా కథనాలను ప్రచురించాయి.. అందులో మాజీ ఎంపీ వినోద్ వ్యాఖ్యలు కూడా ఉన్నాయి అంటూ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
ఈ విషయంలో తనను ఎప్పుడైనా విమర్శించొచ్చన్న అసదుద్దీన్ ఒవైసీ.. మీడియాలో వస్తున్న వార్తలపై బీఆర్ఎస్ స్పందించాలని మరోసారి ఆయన డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com