Kavitha : బంద్ లో కవిత కొడుకు.. పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా..?

Kavitha : బంద్ లో కవిత కొడుకు.. పొలిటికల్ ఎంట్రీ ఉంటుందా..?
X

తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కవిత బయటకు వచ్చేసింది. ఏకంగా తండ్రి కెసిఆర్, అన్న కేటీఆర్ ను కాదని సొంత రాజకీయాలు చేస్తోంది. కెసిఆర్ జెండా లేకుండానే సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్న కవిత తనదైన వ్యూహాలతో అందరి అటెన్షన్ తన మీద ఉండేలా చూసుకుంటుంది. నేడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై బీసీ సంఘాలు బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ లో సడన్ గా కవిత కొడుకు ఆదిత్య ఎంట్రీ ఇచ్చాడు. బందులో పాల్గొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అసలు సడెన్ గా కవిత కొడుకు ఎందుకు బంద్ లో పాల్గొన్నాడు అనేది ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కొంపతీసి కవిత కొడుకు ఏమైనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడా.. వాస్తవంగా అతని ఏజ్ చాలా చిన్నది. ఇంకా చదువుకుంటున్నాడు. కాబట్టి అప్పుడే రాజకీయాల్లోకి వస్తాడా అనేది చెప్పలేం. మరి కవిత ఏ ప్లాన్ కొద్ది కొడుకును సరైన టైంలో తెరమీదకు తీసుకొచ్చింది.

ఇప్పటివరకు కవిత కొడుకు అంటే రాజకీయాల్లో గాని ఇటు ప్రజలకు గాని అటు మీడియాకు గాని పెద్దగా పరిచయం లేదు. కానీ కేటీఆర్ కొడుకు హిమాన్షు అంటే మాత్రం అందరికీ సుపరిచితమే. రాజకీయాల్లో హిమాన్షు పేరు వినిపిస్తూనే ఉంటుంది. కెసిఆర్ మనవడిగా ఇప్పటికే హిమాన్షు పేరు మార్మోగిపోతుంది. సోషల్ మీడియాలోనూ హిమాన్షుకు మంచి క్రేజ్ ఏర్పడింది. కానీ కవిత కొడుకు అంటే అసలు ఎవరికీ పెద్దగా తెలియదు. మరి తన కొడుకు ఎందుకు హైలెట్ కావొద్దు అని కవిత భావించి ఉండొచ్చు. ఆ కారణంతోనే ఆదిత్యను బంద్ లో పాల్గొనేలా చేసినట్టు సమాచారం. బీసీల రిజర్వేషన్ల అంశం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చాలా హాట్ టాపిక్ అవుతుంది. పైగా నేడు తెలంగాణ వ్యాప్తంగా బంద్ జరుగుతుంది. కాబట్టి సాధారణ టైంలో ఏదో ఒక మీటింగ్ కు ఆదిత్యను తీసుకువస్తే ఇంతగా అటెన్షన్ రాదు. ఇప్పుడు బంద్ లో పాల్గొంటే అందరి చూపు అతనిపై ఉంటుంది. పైగా బీసీ సంఘాల నుంచి సానుకూల మద్దతు కూడా వస్తుంది. పోరాటంతోనే తన కొడుకు ఎంతటి ఇచ్చాడని కవిత కూడా చెప్పుకోవచ్చు.

తన కొడుకుని ఇప్పట్లో రాజకీయాల్లోకి తీసుకు రాకపోయినా.. భవిష్యత్తులో తీసుకొచ్చే వ్యూహంలో భాగంగానే ఇప్పటినుంచి జనాలలో గుర్తింపు వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తన కొడుకును కూడా కేసీఆర్ మనవడిగా ఎస్టాబ్లిష్ చేయాలన్నదే ఆమె ప్లాన్ అని సమాచారం. ఇప్పటివరకు కవితకు పెద్దగా రాజకీయ దారి ఏర్పడలేదు. సొంతంగా పార్టీ పెడుతుందనే ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. సొంత ఎజెండాతో ముందుకు వెళుతున్న కవిత రేపటి రోజున తన వారసుడు కూడా రాజకీయాల్లో ఉండాలని.. ముందు నుంచే ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు మనం అందర్నీ చూస్తున్నాం కదా.. రాజకీయ నేతలు తమ వారసులను ముందు నుంచే సోషల్ మీడియాలో, ఒక ప్రధాన మీడియాలో హైలెట్ అయ్యేలా చేస్తూ ఒక సోషల్ గుర్తింపు వచ్చేలా చూసుకుంటున్నారు. అప్పుడు ఆటోమేటిక్ గా సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెరుగుతారు. జనాలు కూడా గుర్తుపడతారు. కాబట్టి భవిష్యత్తులో రాజకీయ ఎంట్రీ ఇచ్చినా పెద్దగా అడ్డంకులు రావు. మరి కవిత తన కొడుకును రాజకీయాల్లోకి తీసుకు వస్తుందా లేదా అనేది చూడాలి.

Tags

Next Story