KCR : కేసీఆర్ కోర్టుకు హాజరవుతారా?

KCR : కేసీఆర్ కోర్టుకు హాజరవుతారా?
X

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలో గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి కేసీఆర్ కు కోర్టు నోటీసులు జారీచేయడం సంచలనం రేపుతోంది. అవినీతి వల్లే ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజ్) కుంగిందని, గత పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో కోట్లాది రూపాయల తెలంగాణ ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని భూపాలపల్లికి చెందిన సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి అనే వ్యక్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ ను కోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్పై సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్లు విచారణకు రావాల్సిందిగా మాజీ సీఎం, బీఅర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సహా మొత్తం ఎనిమిది మందికి

సోమవారం నోటీసులు జారీచేసింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ)కు డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతా లోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్య మంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీష్ రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్లో పేర్కొంటూ మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీర్ ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న మెఘా నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొంటూ మొత్తం ఎనిమిది మందికి భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి నోటీసులు జారీ చేసింది.

మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ) కుంగుబాటు వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి కోర్టు గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి సెప్టెంబర్ 5 విచారణ జరపనున్నారు.

Tags

Next Story