Revanth Reddy : పదిన్నరేళ్ల పాలన.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు అర్థమేంటి..?

Revanth Reddy  : పదిన్నరేళ్ల పాలన.. సీఎం రేవంత్ వ్యాఖ్యలకు అర్థమేంటి..?
X

తెలంగాణలో పదిన్నరేళ్ల పాటు తానే సీఎంగా ఉంటానని సీఎంరేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈసారి ఐదున్నరేళ్లు ఉంటానని చెబుతున్నారు. 2029లోనే జమిలి ఎన్నికలు వస్తాయని.. కాబట్టి ఈ సారి ఆరు నెలలు ఎక్కువ తాను ఉంటానని చెబుతున్నారు. జమిలి ఎన్నికల్లోకూడా కాంగ్రెస్ గెలుస్తుందని.. కాబట్టి తనకు పోటీ లేదంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే జమిలి ఎన్నికలు వస్తే కథ వేరేగా ఉండే ఛాన్స్ ఉంది. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు రెండు జాతీయ పార్టీలు, బీఆర్ ఎస్ మధ్య బలమైన పోటీ ఉంది. దాన్ని ఎవరూ కాదనలేని పరిస్థితి కనిపిస్తోంది. చాపకింద నీరులా బీజేపీ నానాటికీ తెలంగాణలో బలపడుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గనక జమిలి ఎన్నికలు వస్తే అధికారంపై అనేక అనుమానాలు ఖాయం.

ఎందుకంటే బీఆర్ ఎస్ కూడా మళ్లీ తన బలం నిలుపుకునేందుకు బాగానే ప్రతయ్నాలు చేస్తోంది. ఇప్పటికీ కాంగ్రెస్ కు రాష్ట్ర స్థాయిలో అన్ని జిల్లాల్లో బలమైన పట్టు లేదు. కేవలం కిన్ని జిల్లాల్లోనే మెజార్టీ సీట్లు రాబట్టేలా కనిపిస్తోంది. పైగా కాంగ్రెస్ లో తానే మంత్రి, తానే రాజు అన్న రేంజ్ లో సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు. కానీ మరోసారి తానే సీఎంగా ఉంటానని చెప్పడం వల్ల.. ఆ పార్టీలో తనకు పోటీ లేదని నిరూపించుకునే ప్రయత్నం రేవంత్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

సీఎం రేవంత్ సీఎం అయినప్పటి నుంచి కాంగ్రెస్ మీద పూర్తిగా పట్టు సాధించుకుంటున్నారు. తనకు ఎవరూ అడ్డు లేరు అని నిరూపించుకునే రేంజ్ లో ఆయన రాజకీయాలు ఉంటున్నాయి. కాబట్టి ఇంకోసారి పార్టీ అధికారంలోకి వచ్చినా సరే తానే సీఎం అని ముందే హింట్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మరి రేవంత్ రెడ్డి చెప్పినట్టే పరిస్థితులు ఉంటాయా లేదా అనేది భవిష్యత్ చెబుతుంది. అప్పటి వరకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉంటారనేది వాస్తవం.

Tags

Next Story