MLA Madhavaram : కల్యాణలక్ష్మి చెక్కులు ఇవ్వకుంటే ధర్నా చేస్త : ఎమ్మెల్యే మాధవరం

లబ్ధిదారులకు మంజూరైన కల్యా ణలక్ష్మి చెక్కులను రేపటి వరకు ఇవ్వకుంటే తాను ధర్నా చేస్తానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడారు.. మంత్రి వస్తేనే కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ అని అధికారులు సమాధానం చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు. తాను రావడం ఇబ్బంది అయితే.. అధికారులే పంపిణీ చేయాలని చెప్పారు. 'లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. రేపు పొద్దు న్న 11 గంటల వరకు పంపిణీ చేయకపోతే ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా చేస్తా. కూకట్ప ల్లి నియోజకవర్గంలో నెల రోజులుగా 550 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు నిలిపివేశారు. మంత్రి చేతుల మీదుగా లబ్ధి దారులకు అందజేస్తామని అధికారులు చె బుతున్నారు. చెక్కుల కోసం కోసం నా ఇంటి చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. వీటిని ఎమ్మెల్యే పంపిణీ చేయడం ఆనవాయితీ. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం మంత్రి వస్తేనే లబ్ధిదారులకు ఇస్తామని అంటున్నారు' అని మాధవరం అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com