KCR : ఇకపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: కేసీఆర్

KCR : ఇకపై ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం: కేసీఆర్
X

డిప్యూటీ సీఎం భట్టి చేసిన బడ్జెట్ ప్రసంగం ఓ కథలా, రాజకీయ ప్రసంగంలా ఉందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఈ ప్రభుత్వం రైతులను వంచించిందని, బడ్జెట్‌లో ఒక్క పాలసీ ప్రకటించలేదని, ఒక్క ఇండస్ట్రీ పేరు చెప్పలేదని విమర్శించారు. ఏ ఒక్క దానిపైనా క్లారిటీ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకూ ఇచ్చిందేమి లేదని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేదన్నారు. ఇక ప్రభుత్వాన్ని చీల్చిచెండాడుతామని హెచ్చరించారు.

గ్రెస్ ప్రభుత్వ బడ్జెట్‌ విధానపరంగా లేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కొత్త ప్రభుత్వానికి 6 నెలలు సమయం ఇవ్వాలని అనుకున్నామని, కానీ ఆ ప్రభుత్వానికి అసలు పాలసీనే లేదని బడ్జెట్ చూశాక అర్థమైందని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌లో దళితబంధు ప్రస్తావనే లేదని, ప్రభుత్వం దళితుల గొంతు కోసిందని ఆరోపించారు. బడ్జెట్‌లో భట్టి వట్టి మాటలు చెప్పారన్నారు. ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు.

Tags

Next Story