MP Renuka Chowdhury : తప్పులు చేసి నీతులు చెప్తారా : ఎంపీ రేణుకా చౌదరి

MP Renuka Chowdhury : తప్పులు చేసి నీతులు చెప్తారా : ఎంపీ రేణుకా చౌదరి
X

వాస్తవాలు తెలుసుకోకుండా బీఆ ర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నా రని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి ఫైర్ అయ్యారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యా లయంలో ఆమె మీడియా సమావేశంలో మా ట్లాడుతూ కొండలు.. గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెప్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఓ మాట మాట్లాడుతున్నారని.. సీఎంని, మంత్రులను కావాలనే విమర్శిస్తున్నారన్నారు. 'ఈరోజు హరీశ్ రావు 8 గంటలకే మార్కెట్కి వెళ్లడం హాస్యాస్పదం. వ్యవసాయం గురించి తెలిసివాళ్లకు రైతులు ఏ సమయానికి మార్కె టకు వస్తారో తెలుస్తుంది. మీకు ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమీషన్ల గురించి మాత్రమే తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రాహారాలు మాని పని చేసున్నారు. రైతులకు బేడీలు వేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారు. జిల్లాలోని మా మంత్రులు అభివృద్ధి చేసి చూపిస్తారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఆ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని బయటకు తెస్తూ.. ఉద్యోగులకు ఫస్ట్గ్నాడే జీతాలు చెల్లిస్తున్నం. సుజాత నగర్లో నకిలీ విత్తనాలు రైతులను నష్ట పరిచిన కంపెనీ యాజమాన్యంతో వారందరికీ పరిహారం చెల్లించేలా చేశాం. కొత్తగూడెం విమానాశ్రయం ప్రాసెస్ నడు స్తుంది. త్వరలోనే ఎయిర్పోర్ట్ రాబోతుంది. మళ్లీ స్తంబాద్రి ఉత్సవాలు నిర్వహిస్తాం' అని తెలిపారు.

Tags

Next Story