Sajjanna Fire : పాపులారిటీ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడ్తారా? : సజ్జనార్ ఫైర్

Sajjanna Fire : పాపులారిటీ కోసం ఉద్యోగులను ఇబ్బంది పెడ్తారా? : సజ్జనార్ ఫైర్
X

పాపులారిటీ కోసం నిబద్దత, అంకితభావంతో డ్యూటీ చేస్తున్న ఆర్టీసీ ఉద్యో గులను ఇబ్బందులకు గురి చేస్తారా? కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలి గిస్తే టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. లాంటి సోషల్ మీడియా పిచ్చి మాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్ర కారం చర్యలు తీసుకుంటాం' అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. సిటీ బస్సు ఆర్టీసీ కండక్టర్తో యువకుడు ఓ ప్రాంక్ వీడియో చేస్తాడు. ఆర్టీసీ బస్సు కండక్టర్ తో ఓ యువకుడు ప్రవర్తించిన తీరు వీడియో సోషల్మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. 'ఇదేం వెర్రి కామెడీ.. సోషల్ మీడియాలో ఫేమస్ కావడాని ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా? ' అని సజ్జనార్ ట్వీట్ చేశాడు.

టీజీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ తాజాగాట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ..‘ఇదేం వెర్రి కామెడీ!?. సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి ఎన్ని పిచ్చివేషాలైన వేస్తారా!? మీ పాపులారిటీ కోసం నిబద్ధత, అంకితభావంతో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తారా!? . కామెడీ పేరుతో ఆర్టీసీ సిబ్బందికి విధులకు ఆటకం కలిగిస్తే #TGSRTC యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. ఇలాంటి సోషల్ మీడియా పిచ్చిమాలోకాలపై పోలీస్ శాఖ సహకారంతో చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది’ అని హెచ్చరికలు జారీ చేశారు.

Tags

Next Story