Telangana Wine Shops : నేటి నుంచి మూడు రోజుల పాటు వైన్ షాపులు బంద్

గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి. ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ , కరీంనగర్, వరంగల్,నల్గొండ , ఖమ్మం జిల్లాల్లో ఇది వర్తించనుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం ముగియనుంది. అసెంబ్లీ ఎలక్షన్స్‌ను తలపించేలా నెల రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగింది. కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్-నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ జిల్లాల టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు, నల్గొండ-ఖమ్మం-వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న పోలింగ్ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com