రెండు నెలల పరిచయం.. పెళ్లి చేసుకుని హోటల్ కి తీస్కెళ్లి..

రెండు నెలల పరిచయం.. పెళ్లి చేసుకుని హోటల్ కి తీస్కెళ్లి..
భార్య స్నానానికి వెళ్లడంతో సందీప్..

అమ్మాయిలను మోసగించడానికి మార్గాలెన్నో. అదే పని మీద ఉంటూ అదను చూసి ఆమెతో జల్సా చేస్తారు.. ఆపై కావలసినవి దోచుకుని ఉడాయిస్తారు. ఇలాంటివి ఎన్ని సంఘటనలు చూస్తున్నా యధా మామూలుగా ప్రవర్తిస్తున్నారు అమ్మాయిలు.. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసాలు అనేకం. ఫేస్ బుక్ లో పరిచయం ప్రేమగా మారింది.. అది పెళ్లికి దారి తీసింది. పెద్దలు ఒప్పుకోవట్లేదని గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.

ఆపై నగలు తీసుకుని నమ్మి వచ్చిన యువతిని నట్టేట ముంచి పరారయ్యాడు ఓ ప్రబుద్ధుడు. హైదరాబాద్ ఎస్సార్ నగర్ హోటల్ లో పని చేస్తున్న యువతికి సందీప్ అనే యువకుడితో పరిచయమైంది. తనది జగిత్యాల అని తాను కూడా ఓ హోటల్ లో పని చేస్తున్నానని పులిహార కలిపాడు. రెండు నెలల పరిచయం అనంతరం పెళ్లి చేసుకుందామన్నాడు.. పెద్దలు ఒప్పుకోకపోవడంతో గద్వాల్ జిల్లా ఆలంపూర్ లో రహస్యంగా వివాహం చేసుకున్నాడు.

అక్కడి నుంచి కర్నూలు తీసుకెళ్లాడు.. బళ్లారి చౌరస్తాలోని ఓ హోటల్లో దిగారు. 7వ తేదీ సాయంత్రం భార్య స్నానానికి వెళ్లడంతో సందీప్ ఆమె నగలు, రెండు లక్షల నగదు తీసుకుని ఉడాయించాడు. తిరిగి వస్తాడని ఎదురు చూసింది. ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గ్రహించింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Tags

Next Story