TG : సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్ట్ లకు అవమానం

TG : సీఎం సొంతూరులో మహిళా జర్నలిస్ట్ లకు అవమానం
X

సీఎం రేవంత్‌ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఇద్దరు మహిళా జర్నలిస్టులను అడ్డుకున్నారు కాంగ్రెస్‌ కార్యకర్తలు. రుణమాఫీ అమలు తీరును పరిశీలిస్తున్న మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి దగ్గర నుంచి మైకులను లాక్కున్నారు.

వీడియోను షూట్ చేయకుండా అడ్డుకున్నారు. ఈ ఇష్యూపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నారు జర్నలిస్టులు. మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తల తీరును తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.

Tags

Next Story