Telangana : అడవిలో మహిళలు మిస్సింగ్.. పోలీస్ ఎంట్రీతో కథ సుఖాంతం

Telangana : అడవిలో మహిళలు మిస్సింగ్.. పోలీస్ ఎంట్రీతో కథ సుఖాంతం
X

తెలంగాణలోని నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పనపల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు తునికాకు సేకరణకు వెళ్లి అడవిలో మిస్సయ్యారు. గురువారం సాయంత్రం వెళ్లిన వీరు ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్వయంగా రంగంలోకి దిగిన ఎస్పీ జానకి షర్మిల తన సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం మహిళలు ఏడ్చుస్తున్న శబ్దం విని చుట్టు పక్కల పరిశీలించగా మహిళలు బత్తుల సరోజ, గట్లమీద లక్ష్మి, రాధ, లింగవ్వ పోలీసులను చూసి భావోద్వేగంతో ఎస్పీ జానకిని ఆలింగనం చేసుకున్నారు. మహిళలను గ్రామానికి తీసుకువచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎవరు అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని, దారుల వెంటే వెళ్లాలని ఎస్పీ గ్రామస్తులకు సూచించారు.

Tags

Next Story