Women Commission : సినిమాల్లో అసభ్య నృత్యాలపై మహిళా కమిషన్ సీరియస్

ఇటీవల తెలుగు సినిమాల్లో నృత్యాలు హద్దులు దాటుతున్నాయని, కుటుంబనేపథ్యంలో చూడాల్సిన వీక్షకులను దృష్టిలో పెట్టుకొని డ్యాన్స్ ను కంపోజ్ చేయాల్సిన డాన్స్ మాస్టర్లు రెచ్చిపోయి అసభ్యకరంగా డాన్స్లు చేస్తున్నారని మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ళ శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. నచ్చిన రీతిలో హీరోయిన్లతో ఆటబొమ్మలా ఆడిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఓ వీడియోపై స్పందించారు. నేటి సమాజంలో డ్యాన్స్ ప్లు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయని, వాటిపై పలు ఫిర్యాదులు అందాయని తెలిపారు. సినిమా అనేది సమాజంపై ప్ర భావం చూపే శక్తివంతమైన మాధ్యమం కావడంతో మహిళలను అవమానించే రీతిలో అసభ్యకరంగా చూపించే అంశాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సినిమా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు సంబంధిత వర్గాలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరించారు.
మహిళలను తక్కువ చేసి చూపించే, అసభ్యకరమైన డాన్స్ స్టెప్సున్న వెంటనే నిలిపివేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ హెచ్చరికను పాటించకపోతే, సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా రంగం సమాజానికి సానుకూల సందేశాలను అందించడం, మహిళల గౌరవాన్ని కాపాడటం అనేది నైతిక బాధ్యత తీసుకోవాలన్నారు. యువత, పి ల్లలపై సినిమాలు చూపించే ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని, సినిమా పరిశ్రమ స్వీయ నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇలాంటి అంశాలపై ప్రజలు, సామాజిక సంస్థలు తమ అభిప్రాయాలను మహిళా కమిషను తెలియజేయవచ్చని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com