Director Trinadha Rao : నక్కిన త్రినాథరావుపై మహిళా కమిషన్ సీరియస్

హీరోయిన్ అన్షు గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ నక్కిన త్రినాథరావుపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఆయనకు త్వరలోనే నోటీసు జారీ చేస్తామని ఛైర్‌పర్సన్ నేరేళ్ల శారద తెలిపారు. కాగా ‘అన్షు మళ్లీ నటిస్తున్నారు. ఆమె కొంచెం సన్నబడింది. అందుకే తిని పెంచమ్మా. తెలుగుకు సరిపోదు. అన్నీ కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా’ అని త్రినాథరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
సందీప్ కిషన్ హీరోగా రీతూ వర్మ హీరోయిన్‌గా మజాకా మూవీ రూపొందుతుంది. ఇందులో రావు రమేష్, అన్షు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి త్రినాథరావు నక్కిన దర్శకుడు. బెజవాడ ప్రసన్న కుమార్ రైటర్. ఈ మూవీ టీజర్ ఈవెంట్ ఆదివారం(జనవరి 12)న హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఈవెంట్‌లో దర్శకుడు త్రినాథరావు నక్కిన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com