KTR : కేటీఆర్‌పై సుమోటోగా మహిళా కమిషన్ కేసు విచారణ

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహిళలపై చేసిన వ్యాఖ్యలను.. తెలంగాణ మహిళా కమిషన్ సుమోటోగా తీసుకుంది. మహిళల పట్ల కేటీఆర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు మహిళా కమిషన్ అభిప్రాయ పడింది. తెలంగాణ మహిళల్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.. కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద.
కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై విచారణకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణాలపై మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 'బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి పొట్టు తీసుకుంటే తప్పేంటీ' అని ప్రశ్నించగా.. దానిపై కేటీఆర్ స్పందిస్తూ.. 'బస్సుల్లో కుట్లు, అల్లికలే కాదు, అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకున్నా.. తమకు అభ్యంతరం లేదన్నారు.
కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపగా.. మహిళా కమిషన్ విచారణకు ఆదేశించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com