Telangana : మహిళల ఉచిత ప్రయాణ విలువ 6700 కోట్లు.

Telangana : మహిళల ఉచిత ప్రయాణ విలువ 6700 కోట్లు.
X

తెలంగాణ ఆర్టీసీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణ విలువ రూ.6700 కోట్లుగా నమోదు అయింది. ఈ మేరకు ఆర్టీసీకి నిధులు విడుదల చేయనుంది ప్రభుత్వం. ఇప్పటి వరకు 200 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ నేపథ్యంలో రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 97 ఆర్టీసీ డిపోల్లో 341 బస్ స్టాండ్ లలో సంబరాలు జరుపనున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ పథకం ద్వారా రాష్ట్రానికి చెందిన మహిళలకు ఆర్టీసీ బస్సు లో ఉచిత ప్రయాణాన్ని కల్పించింది ప్రభుత్వం. కేవలం తమ ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఉచితంగా గమ్య స్థానాలకు చేరుస్తున్నారు. గత 18 నెలలు గా విజయవంతం గా ఈ పథకం రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మహిళల ఉచిత ప్రయాణ విలువ 6700 కోట్లు గా నమోదు అయిందని...ఈమేరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

Tags

Next Story