Crime : సంగారెడ్డిలో కెమికల్‌ లీకై కార్మికులకు గాయాలు

Crime : సంగారెడ్డిలో కెమికల్‌ లీకై కార్మికులకు గాయాలు
X

సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కంబాలపల్లిలోని అరెనీ లైఫ్ సైన్స్ పరిశ్రమలో బాయిలర్ నుంచి కెమికల్ లీకై నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. ముఖం, కాళ్లపై కెమికల్ పడటంతో చర్మం ఊడి తీవ్రగాయాలతో కార్మికులు తల్లడిల్లిపోయారు. గమనించిన తోటి కార్మికులు హుటాహుటిన సంగారెడ్డిలోని బాలాజీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని వెంటనే హైదరాబాద్ తరలించాలని సూచించారు. ఈ మేరకు సంగారెడ్డి నుంచి క్షతగాత్రులను హైదరాబాద్ తరలించారు. గాయపడ్డ కార్మికులు శివారెడ్డి, శ్రీనివాస్, దివాకర్, సింహాచలం కాగా.... వీరిలో ముగ్గురికి ముఖం చేతులు, కాళ్లు, శరీరంలోని కొన్ని భాగాలు కాలిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు వైద్యులు తెలిపారు. పరిశ్రమ యజమాన్యం నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని C.I.T.U నేతలు ఆరోపించారు.

Tags

Next Story