TG : బియ్యంలో పురుగులు.. అధికారుల పరుగులు

TG : బియ్యంలో పురుగులు.. అధికారుల పరుగులు
X

విద్యార్థుల సంక్షేమ హాస్టల్స్ లో బియ్యంలో పురుగులు రావడంతో స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది.స్టూడెంట్స్ కు వడ్డించే మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యంలో తెల్లటి పురుగులు కనిపించడంతో ఒక్కసారిగా స్టూడెంట్స్ ఆందోళనకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తెల్లటి పురుగులతో కలిగిన బియ్యాన్ని వడ్డిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రిన్సిపాల్ వీరన్నను విద్యార్థి సంఘాలు వివరణ కోరగా బియ్యంలో పురుగులు వచ్చిన మాట వాస్తవమేనని..గమనించి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం చేరవేశామని ఐదు క్వింటాళ్ల బియ్యాన్ని ఎమ్మెల్సీ పాయింటుకు తరలిస్తున్నట్లు తెలిపారు.

స్కూళ్లు, గురుకుల్లాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు చేపట్టారు. గురుకులంలో తనిఖీకి వెళ్లిన ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ అక్కడ పరిస్థితి చూసి షాక్‌కు గురయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో తనిఖీకి వెళ్లారు అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీ. వంట మనిషి లేకపోవడంతో రోజువారీ కూలీలతో వంట చేయిస్తున్నారు. స్టోర్ రూంలో కుళ్లి బూజు పట్టిన ఆలుగడ్డలు, ఐఎస్ఐ మార్క్ లేని ఉప్పు ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి.

మెనూ ప్రకారం పప్పు వండాల్సి ఉండగా నీళ్ల సాంబార్ వండారు వంట కూలీలు. అడిషనల్ కలెక్టర్ వస్తున్నాడని కొన్ని గుడ్లు ఉడికించగా అవి కుళ్లిపోయిన పరిస్థితి కనిపించింది. పిల్లలకు ఇప్పటివరకు యూనిఫాంలు ఇవ్వలేదు.. చలికాలం ప్రారంభమైనా ఇప్పటికీ బ్లాంకెట్లు అందలేదు. విద్యార్థులకు సమస్యలు లేకుండా చూసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని, అవసరమైన ప్రతిపాదనలు పంపాలని ఏటీడీవో హుస్సేన్, ఎంపీడీవో ప్రసాద్ ను అడిషనల్​కలెక్టర్​ ఆదేశించారు.

Tags

Next Story