Yadadri: బ్రహ్మోత్సవాలు షురూ..

Yadadri: బ్రహ్మోత్సవాలు షురూ..
మంగళవారం నుంచి మార్చి మూడవ తేదీ వరకు ఉత్సవాలు

యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభం అయ్యాయి. మంగళవారం నుంచి మార్చి మూడవ తేదీ వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. బ్రహ్మత్సవాల్లో భాగంగా తొలి రోజు విష్వక్సేనారాధన, స్వస్తివచనం, రక్షబంధనం పూజలు నిర్వహించారు. ఇక ప్రధాన ఆలయం పునర్ నిర్మాణం తరువాత తొలి బ్రహ్మోత్సవాలు కావడంతో.. అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. పోచంపల్లి పద్మశాలి చేనేత సహకార సంఘం తరుపున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. 11 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ చార్యులు తెలిపారు.

Tags

Next Story