Yadadri : యాదాద్రిలో వర్షం బీభత్సం.. ప్రారంభమైన రెండు నెలలకే కుంగిన ఘాట్‌ రోడ్‌

Yadadri :  యాదాద్రిలో వర్షం బీభత్సం.. ప్రారంభమైన రెండు నెలలకే కుంగిన ఘాట్‌ రోడ్‌
Yadadri : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో తెల్లవారుజామున కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది.

Yadadri : తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రిలో తెల్లవారుజామున కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. వర్షానికి పనుల్లో నాణ్యత లోపాలు బయటపడ్డాయి. కొండపైకి వెళ్లే మూడో ఘాట్ రోడ్డు కుంగిపోయింది. 2019లో దాదాపు 30 కోట్ల రూపాయలతో మూడో ఘాట్‌ రోడ్డు పనులు ప్రారంభించారు.

2022 మార్చిలో ఘాట్‌ రోడ్డు సహా బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. యాదాద్రి దేవాలయం పున:ప్రారంభం తర్వాత ఈ రోడ్డు అందుపబాటులోకి వచ్చింది. ఐతే ప్రారంభమైన రెండు నెలల్లోనే రోడ్డు కుంగిపోయింది. దీంతో కొండపైకి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భక్తులు కాలినడకన కొండపైకి వెళ్తున్నారు.

ఈదురుగాలుల ధాటికి చలువ పందిళ్లు కొట్టుకుపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోకి వరద నీరు చేరింది. యాదాద్రి కొండపై నాణ్యత లోపాలు బయటపడడంతో దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎక్కడెక్కడా ఇబ్బందులు తలెత్తాయని పరిశీలించారు.

గుట్ట అభివృద్ధికి దాదాపు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా నాణ్యత లోపాలు బయటపడడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story