Konda Surekha : యాదాద్రి లడ్డూ బేష్.. మంత్రి కొండా సురేఖ

Konda Surekha : యాదాద్రి లడ్డూ బేష్.. మంత్రి కొండా సురేఖ
X

యాదగిరిగుట్టలో భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామని మంత్రి కొండా సురేఖ అన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఆలయంలో 14 చోట్ల మంచినీటి సౌకర్యం ఏర్పాటు చేశామని తెలిపారు. 47 చోట్ల టాయిలెట్స్ నిర్మించినట్లు చెప్పారు. విష్ణు పుష్కరిణి గుండాన్ని ఏర్పాటు చేశామన్నారు. చంటి బిడ్డ తల్లులకు ప్రత్యేక లాంజ్‎లు, ఎలక్ట్రిక్ వాహనాల సౌకర్యం కల్పించామని చెప్పారు. రూ. 15 కోట్లతో దాతల సహాయంతో అన్నదాన సత్రం నిర్మించామన్నారు. 60 కిలోల బంగారు తాపడంతో రాజగోపురం నిర్మించాలని నిర్ణయించినట్లు తెలిపారు. లడ్డూ నాణ్యతలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. భద్రాద్రి అభివృద్ధి కోసం కొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రూ. 3 కోట్లతో జానకి సదనం నిర్మిస్తున్నామని తెలిపారు. దేవాలయానికి సంబంధించిన 24సేవలు ఆన్ లైన్‎లో అందిస్తున్నామని ప్రకటించారు. వేములవాడ దేవస్థానానికి చెందిన 850 కోడెలను రైతులకు అందించినట్లు మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. వీటీడీఏకు ప్రభుత్వం రూ. 70 కోట్లు విడుదల చేసిందని ప్రకటించారు. వెండి పల్లకీలు, బంగారు తాపడం రాజగోపురం నిర్మించాలని నిర్ణయించామన్నారు. రూ.110 కోట్లతో బాసర ఆలయ పునర్నిర్మాణం చేస్తామన్నారు. వివాదంలో ఉన్న దేవాదాయ, అటవీ శాఖ భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి కొండా సురేఖ తెలిపారు.

Tags

Next Story