Telangana : ఎల్లో అలెర్ట్... రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

Telangana : ఎల్లో అలెర్ట్... రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
X

తెలంగాణ వ్యాప్తంగా రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్ తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని, ఆ తర్వాత క్రమంగా 2-3 డిగ్రీలు పెరుగుతాయని పేర్కొంది.

రాష్ట్రంలో అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై గ్రామాల వారీగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని అధికారులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శుక్ర, శనివారాల్లో కురిసిన వర్షానికి 13 జిల్లాల్లో 11 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. నిజామాబాద్ , కామారెడ్డి, ఆసిఫాబాద్, కరీంనగర్ , వరంగల్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో పంట నష్టం ఎక్కువగా జరిగినట్లు అధికారులు గుర్తించారు.

Tags

Next Story