TG : బాబోయ్ చలి.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!

TG : బాబోయ్ చలి.. రాబోయే 3 రోజులు జాగ్రత్త!
X

తెలంగాణలో రాబోయే 3 రోజులు రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని, 2-8 డిగ్రీల వరకు తగ్గిపోయినట్లు తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, నిజామాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల లోపు నమోదైనట్లు పేర్కొంది.

ఆదిలాబాద్‌లోని ఇతర ప్రాంతాలైన పోచార, భోరాజ్, తాండ్రలో కనిష్ట ఉష్ణోగ్రత 6.4° నుండి 6.6°C వరకు నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు 13 కేంద్రాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలిగాలులతో ఆదిలాబాద్ జిల్లా అతలాకుతలమైంది. మెదక్ జిల్లాలోని కోహీర్ మండల కేంద్రంలో 6.8°C, నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండల కేంద్రంలో 7.6°C, మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలంలో 8.0°C, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట మండలం అక్బర్-భూంపల్లి గ్రామంలో 8.6°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Tags

Next Story