TG : స్కిల్ యూనివర్సిటీ పనులు ప్రారంభం

యంగ్ ఇండియా స్కిల్ యూ నివర్సిటీ భవనాల నిర్మాణానికి మేఘా ఇంజి నీరింగ్ సంస్థ శ్రీకారం చుట్టింది. రంగారెడ్డి జిల్లా మీరాఖాన్ పేటలోని నెట్ జీరో వ్యాలీలో ఎంఈఐఎల్ డైరెక్టర్ రవి పి. రెడ్డి, వైస్ ప్రెసిడెం ట్ శివకుమార్ ఆధ్వర్యంలో ఇవాళ పనులు ప్రారంభించారు. రవి పి. రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అవతరణ దినోత్సవం (జూన్ రెండో తేదీ) నాటికి తొలిదశ భవనాల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఎయిర్ కండీషన్ లతో అవసరం లేకుండా ఓపెన్ ఎయిర్ వ్యవస్థ, మంచి వెంటలేషన్ తో భవనాలు నిర్మిస్తున్నా మని వైస్ ప్రెసిడెంట్ శివకుమార్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భవనాలు నిర్మిస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల రూ.200 కోట్ల విరాళం అందజే శామని, అదే సమయంలో భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పందం చేసుకు న్నామని తెలిపారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్, లైబ్రరీ, ఆడిటోరియం, అత్యాధునిక క్లాస్ రూములు, లాబొరేటరీలు, ఇతర మౌలిక వసతులు కల్పిస్తామని పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com