Suicide : ప్రియురాలు కోసం యువకుడి ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లాలో విషాదం..

Suicide : ప్రియురాలు కోసం యువకుడి ఆత్మహత్య.. సూర్యాపేట జిల్లాలో విషాదం..
X

ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు దూరం పెట్టడాన్ని తట్టుకోలేకపోయాడు ఆ యువకుడు. పెళ్లి చేసుకొని జీవితాంతం సంతోషంగా కలిసి ఉండాలని కలలు కన్నాడు. ఐతే తన ప్రియురాలు మరొకరితో చనువుగా ఉండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. కన్న తల్లిదండ్రులను కూడా కాదని మరణమే దిక్కు అనుకున్నాడు. ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. సూర్యాపేట జిల్లా మోతీ మండలం బోరబండ్ల గూడెం లో జరిగిన ఈ విషాద ఘటన అందరిని కంట తడి పెట్టించింది.

పోలీసుల వివరాల ప్రకారం... బోరబండ్ల గూడెం గ్రామానికి చెందిన ఏపూరి ప్రవీణ్ (28) గత ఐదేళ్లుగా ఖమ్మం జిల్లా కు చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. ఐతే గత కొన్ని రోజుల నుండి యువతి ప్రవీణ్ ను దూరం పెట్టింది. ఫోన్ నెంబర్ కూడా బ్లాక్ చేయడంతో ప్రవీణ్ మనస్థాపానికి గురయ్యాడు. అంతే కాకుండా మరో వ్యక్తితో మాట్లాడుతున్న విషయం తెలిసి ఆత్మహత్య కు యత్నించాడు ప్రవీణ్. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే స్థానికులు ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా... అక్కడ చికిత్స పొందుతూ ప్రవీణ్ మృతి చెందాడు. అందరితో కలివిడిగా ఉండే ప్రవీణ్ అర్ధంతరంగా చనిపోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల ఫిర్యాదు తో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story