TG : ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య!

TG : ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని యువతి ఆత్మహత్య!
X

తల్లిదండ్రులు ఇష్టం లేని వివాహం చేస్తున్నారని మనస్థాపానికి గురైన ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. అనంతసాగర్ గ్రామానికి చెందిన దాసరి మల్లమ్మ కొండయ్య దంపతుల రెండవ కూతురు అర్చన(18) డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నది. ఇటీవల ఆమెకు పెళ్లి కుదిరింది. తల్లిదండ్రుల తెచ్చిన పెళ్లి సంబంధం ఇష్టం లేకపోవడంతో అర్చన తీవ్ర మనోవేదన చెంది ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు జగదేవపూర్ ఎస్సై చంద్రమోహన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story