Youtuber Praneeth : గంజాయి తీసుకున్న ప్రణీత్ హన్మంతు.. టెస్టుల్లో వెల్లడి

Youtuber Praneeth : గంజాయి తీసుకున్న ప్రణీత్ హన్మంతు.. టెస్టుల్లో వెల్లడి
X

తండ్రీకూతుళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్టయిన యూట్యూబర్ ప్రణీత్ హన్మంతు గంజాయి తీసుకున్నట్లు టెస్టుల్లో తేలింది. అతని నుంచి సేకరించిన శాంపిల్స్‌లో గంజాయి సేవించిన ఆనవాళ్లు ఉన్నట్లు ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చింది. ఇప్పటికే అతనిపై ఐటీ, పోక్సో యాక్ట్‌తో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 79, 294 కింద కేసు నమోదు కాగా, తాజాగా నార్కోటిక్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్-1985 కింద పలు సెక్షన్లను జోడించారు.

సోషల్ మీడియాలో తండ్రి, కూతురు వీడియోపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుకు కోర్టు జ్యూడీషియల్ రిమాండ్ విధించింది. హైదరాబాద్ నాంపల్లి కోర్టు ప్రణీత్ కు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రణీత్ పై 67 ఐటీ యాక్ట్, ఫోక్సో యాక్ట్, 79, 294 బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం బెంగళూరులో అరెస్ట్ చేశారు.

గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ప్రణీత్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో ఏ2గా డల్లాస్ నాగేశ్వరరావు, ఏ3గా బుర్రా యువరాజ్, ఏ4గా సాయి ఆదినారాయణను ఉన్నారు. ప్రణీత్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు.

Tags

Next Story