మేం అధికారంలోకి వస్తే సాగునీటి సమస్యను పరిష్కరిస్తాం : వైఎస్ షర్మిల..!

YS Sharmila : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని.. వైఎస్ షర్మిల విమర్శించారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి పిలిచి, కౌగిలించుకొని భోజనాలు పెడతారు కానీ.. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎందుకు కూర్చొని మాట్లాడుకోరని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వస్తే నీటి సమస్యను పరిష్కరిస్తామన్న షర్మిల.. రాష్ట్రానికి రావాల్సిన చుక్కనీటిని వదలమని.. పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా తీసుకోమని తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నేతలతపై వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులకు వైఎస్‌ఆర్ పేరు ఉచ్ఛరించే హక్కు కూడా లేదని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ అవసరాల కోసమే వైఎస్‌ఆర్‌ను వాడుకుంటున్నారని మండిపడ్డారు. మరోవైపు టీఆర్‌ఎస్ -బీజేపీలు తోడుదొంగలన్న షర్మిల.. కేసీఆర్ అవినీతికి సంంధించిన ఆధారాలున్నాయన్న బండి సంజయ్.. వాటిని ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. ఈ విషయంలో రెండు పార్టీల మధ్య డీల్ కుదిరిందా అని ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com