నేను బతకే ఉన్నా: కోటా శ్రీనివాసరావు

నేను బతకే ఉన్నా: కోటా శ్రీనివాసరావు
సీనియర్‌ నటుడు కోటా మృతి అంటూ వచ్చిన ఫేక్‌ వార్తలపై స్పందించిన కోటా

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కొన్ని దశాబ్దాలుగా విశేష పాత్రల్లో నటిస్తు ఎందరో అభిమానుల్ని సంపాదించుకున్న సీనియర్‌ నటుడు కోటా శ్రీనివాసరావు. అయితే కోటా చనిపోయినట్లు మంగళవారం ఉదయం నుంచి సోషల్‌ మీడియాలో షికార్లు పుకార్లు కొడుతున్నాయి. సీనియర్‌ నటుడు కోటా హైదరాబాద్‌లోని తన నివాసంలో కన్నుమూశారంటూ వార్తలు వచ్చాయి. దీంతో నిజమేనని చాలామంది నమ్మారు. ముఖ్యంగా తన అభిమానులు, ఆత్మీయులు తీవ్ర దిగ్భ్రాంతికి గురై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పోలీసులు సైతం ఈ వార్త నిజమేనేమోనని తన నివాసం వద్దకు భద్రత కల్పించేందుకు వచ్చారు. అలాగే కొటా ఫోన్‌కు కూడా విపరీతమైన కాల్స్‌ వస్తుండటంతో ఆయన షాక్‌ అయ్యారు. దీంతో ఈ పుకార్లను ఆపేందుకు తానే స్వయంగా ఓ వీడియోను విడుదల చేశారు. తాను బతికే ఉన్నానని ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. రేపు ఉగాది పండుగను జరుపుకోవడానికి సిద్ధమౌతున్నాని తెలిపారు. ఇలా అవాస్తవ వార్తలు పుట్టించే వారికి బుద్ది చెబుతూ.. డబ్బు సంసాదించాలంటే జీవితంలో చాలా చండాలమైన పనులు ఉన్నాయి అవి చేసుకొని సంపాదించుకొవచ్చునని వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story