సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూత..!

సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ కన్నుమూత..!
సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) మృతి చెందారు.

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు (శుక్రవారం) తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఆయన వయస్సు 64 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి మెప్పించారు. కిరాతకుడు (కొత్త సినిమా) సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. ఇక రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించారు. ఆయన స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామం.. గతంలో ఆ గ్రామానికి సర్పంచ్ గా ఆయన సేవలందించారు.

Tags

Read MoreRead Less
Next Story