America: ఘనంగా 23వ తానా మహాసభ

తానా 23వ మహాసభలు అమెరికా ఫిలడెల్ఫియా నగరంలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ కేంద్రంలో ఘనంగా జరుగుతున్నాయి.మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎల్లా కృష్ణ కీలకోపన్యాసం చేశారు. అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. భారత్‌లో యువశక్తి అధికంగా ఉందని, అవకాశాలను అందిపుచ్చుకుంటూ అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. చిత్ర, సింహ, కౌసల్య ఆలపించిన సినీగీతాలు అలరించాయి. కాప్రికో బ్యాండ్ లైవ్ మ్యూజిక్ అందరినీ ఉత్సాహంలో ముంచెత్తింది."తెలుగుకి తందాన తానా, తరతరాల తానా" నృత్యరూపకం విశేషంగా ఆకట్టుకుంది. తానా అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి,కో ఆర్డినేటర్ రవి పొట్లూరి, కాన్ఫరెన్స్ చైర్మన్ ఎల్ శ్రీనివాస్ పర్యవేక్షించారు. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, నటులు రాజేంద్రప్రసాద్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com