Balakrishna: అభిమాని గృహప్రవేశానికి అతిథిగా బాలయ్య..

Balakrishna: అభిమాని గృహప్రవేశానికి అతిథిగా బాలయ్య..
Balakrishna: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు..

Balakrishna: సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ హిందూపురంలో పర్యటించారు.. ఓ అభిమాని ఇంటి గృహప్రవేశం కోసం బాలకృష్ణ స్వయంగా తరలివచ్చారు.. సత్యసాయి జిల్లా హిందూపురం మండలంలోని కిరికెర మాజీ సర్పంచ్‌ రాము కొత్తగా ఇల్లు నిర్మించుకోగా.. గృహప్రవేశానికి రావాలని బాలకృష్ణను ఆహ్వానించారు.. దీంతో హైదరాబాద్‌ నుంచి విమానంలో బెంగళూరు చేరుకుని అక్కడ్నుంచి రోడ్డుమార్గంలో గ్రామానికి వెళ్లారు.. బాలయ్య రాకతో గ్రామంలో సందడి వాతావరణం కనిపించింది.. హిందూపురానికి చెందిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది.. ఆ అభిమాని దంపతులు బాలకృష్ణకు పాదాభివందనం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story