BHOLA SHANKAR: పవన్ ను ఇమిటేట్ చేస్తున్న..చిరంజీవి

BHOLA SHANKAR: పవన్ ను ఇమిటేట్ చేస్తున్న..చిరంజీవి
భోళాశంకర్ లో తాను పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను చిరంజీవి ట్విట్టర్ లో పంచుకున్నారు.

మెహర్ రమేశ్ దర్శకత్వంలో తాను నటిస్తున్న భోళాశంకర్ చిత్రం నుంచి మెగాస్టార్ చిరంజీవి అప్పుడప్పుడు లీకులు ఇస్తున్నారు.తాజాగా చిరు ఓ మెగా పవర్ వీడియోను లీక్ చేశారు. భోళాశంకర్ లో తాను పవన్ కల్యాణ్ ను ఇమిటేట్ చేస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోను చిరంజీవి ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ లీక్ లో కనిపించేది కొంచెమేనని, సినిమాలో మరింత చూడొచ్చని పవన్ అభిమానులను సంతోషానికి గురిచేశారు. ఏకే ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న భోళాశంకర్ ఆగస్టు 11న వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది.ఇందులో చిరంజీవి సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తుండడం విశేషం. భోళాశంకర్ చిత్రానికి మహతి స్వరసాగర్ సంగీతం అందించాడు.

Tags

Read MoreRead Less
Next Story