మెగాస్టార్ "భోళా శంకర్" టీజర్ రిలీజ్..

మెగాస్టార్ భోళా శంకర్ టీజర్ రిలీజ్..
"స్టేట్ డివైడ్ అయినా అందరు నా వాళ్ళే ,ఆల్ ఏరియా అప్నా హై నాకే హద్దుల్లేవు సరిహద్దుల్లేవ్"

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భోళా శంకర్ టీజర్ రానే వచ్చింది. ఈ టీజర్ లో మెగా స్టార్ చిరంజీవి ఒక డిఫరెంట్ లుక్ లో కనిపిస్తాడు. మొత్తం 33 మందిని చంపేశాడు అనే డైలాగు తో టీజర్ స్టార్ట్ అవుతుంది.. ఇందులో చిరంజీవి మాస్ లుక్ లో కనిపిస్తాడు. ఈ టీజర్ లో "కౌన్ హాయ్ తు " అనే డైలాగు తో మెగా స్టార్ ఎంట్రీ ప్రేక్షకుల్ని ఉర్రుతలూగింస్తుంది. కీర్తి సురేష్, తమన్నా హీరోయిన్స్ ని కూడా చూడవచ్చు. "షికారికి వచ్చిన షేర్ ని బే" అనే డైలాగు వీర మాస్ లెవెల్ లో ఉంటుంది. అన్ని రకాల ప్రేక్షకుల్ని అలరించే విదంగా టీజర్ కనిపిస్తుంది.

టీజర్ ఎండింగ్ లో చిరంజీవి"స్టేట్ డివైడ్ అయినా అందరు నా వాళ్ళే ,ఆల్ ఏరియా అప్నా హై నాకే హద్దుల్లేవు సరిహద్దుల్లేవ్ దేఖ్ లేంగే ఆగస్ట్ 11 కో" డైలాగ్ కి ఫ్యాన్స్ విజిల్స్ వేయాల్సిందే. భోళా శంకర్ చిత్రాన్ని రామ్ బ్రహ్మం సుంకర నిర్మించారు. ఈ చిత్రానికి మిహిర్ రమేష్ దర్శకత్వం వహించాడన్నసంగతి తెలిసిందే. ఆగస్టు 11 రోజున ప్రేక్షకులకు అలరించేందుకు సిద్ధమైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగ విడుదల కానుంది .

Tags

Read MoreRead Less
Next Story