ప్రభాస్ అంటే క్రష్.. డేటింగ్‌కు కూడా రెడీ..!

ప్రభాస్ అంటే క్రష్.. డేటింగ్‌కు కూడా రెడీ..!
దివి వైద్య.. బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ.. అంతకుముందు పలు పలు సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తుంపు బిగ్ బాస్ షోతో కైవసం చేసుకుంది.

దివి వైద్య.. బిగ్ బాస్ షోతో బాగా ఫేమస్ అయింది ఈ బ్యూటీ.. అంతకుముందు పలు పలు సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తుంపు బిగ్ బాస్ షోతో కైవసం చేసుకుంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫోటోలతో యూత్ ని కట్టిపడేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్ గా అవకాశాలు సంపాదించుకుంటుంది ఈ సొట్ట బుగ్గల సుందరి. తాజాగా ఓ మూవీ ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దివి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పైన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. తనకి ప్రభాస్ అంటే చాలా క్రష్ అని చెప్పుకొచ్చింది. మిర్చి సినిమాతో ప్రభాస్‌కు ఫ్యాన్‌ అయిపోయానని, అప్పటి నుంచి I Love You అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ కి మెసేజ్ లు పంపేదానిని అని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఒకవేళ అవకాశం వస్తే ప్రభాస్‌తో డేటింగ్‌కు వెళ్తానని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story