sai dharam tej : కాలర్ బోన్ సర్జరీ సక్సెస్.. నిలకడగానే ఆరోగ్యం..!

అపోలో వైద్యులు సాయిధరమ్‌తేజ్‌కు కాలర్‌బోన్ సర్జరీ పూర్తి చేశారు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని.. క్రమంగా మెరుగుపడుతోందని తెలుపుతూ హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సర్జరీ తర్వాత 24 గంటలపాటు అబ్జర్వేషన్‌లో ఉంచుతున్నామన్నారు. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో సర్జరీ జరిగిందని.. త్వరలోనే తేజ్ పూర్తిగా కోలుకుంటాడని వివరించారు. నిన్నటి నుంచి తేజ్ కాస్త స్ఫృహలోకి వచ్చి నెమ్మదిగా కోలుకుంటుండడంతో కాసేపు వెంటిలేటర్ తీసారు. ఆ సమయంలో కొంచెం నొప్పిగా ఉందని తేజ్ చెప్పినట్టు సమాచారం. సర్జరీకి రెండ్రోజులు ఆగాలా.. ఇవాళే చేయాలా అనే దానిపై ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించారు. మరోసారి టెస్ట్‌లు, ఎక్సరేలు తీసిన తర్వాత ఇవాళే అది పూర్తి చేశారు. చిరంజీవి సహా మెగా కుటుంబ సభ్యులంతా అపోలో ఆస్పత్రిలోనే ఉన్నారు.
శుక్రవారం రాత్రి 8 గంటల 5 నిమిషాలకు దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత నోవార్టిస్ సమీపంలో బైక్ యాక్సిడెంట్‌లో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయ్యి పడిపోవడంతో దాదాపు 30 మీటర్లు జారుకుంటూ దొర్లిపడిపోయాడు. ఆ యాక్సిడెంట్‌కి సంబంధించి తాజాగా మరికొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రమాదాన్ని గమనించిన వెంటనే అటుగా వెళ్తున్న వాహనదారులు తేజ్‌ను జాగ్రత్తగా ఫుట్‌పాత్‌పై కూర్చోపెట్టి సపర్యలు చేశారు. ముందుగా తేజ్‌కి సాయం చేసిన అబ్దుల్ అనే వ్యక్తే 108కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. 100కి కూడా ఫోన్ చేసి పోలీసులకు ప్రమాద విషయం చెప్పారు. అంబులెన్స్ వచ్చే వరకూ అక్కడే ఉండి సాయం చేశాడు. ఈ ప్రమాదం తర్వాత సాయిధరమ్ తేజ్.. ఫుట్‌పాత్‌పై మాట్లాడలేని స్థితిలో కూర్చున్న దృశ్యాలు యాక్సిడెంట్ తీవ్రతకు అద్దం పడుతున్నాయి. తలకు హెల్మెట్ ఉండడం, జర్కిన్ వేసుకుని ఉండడం వల్ల పెను ప్రమాదం నుంచి తేజ్ బయటపడ్డాడు.
ఈ యాక్సిడెంట్‌లో సాయిధరమ్ తేజ్ కంటికి కూడా గాయమైంది. మొదట అక్కడున్న వాళ్లెవరూ అతన్ని గుర్తుపట్టలేదు. ఎవరో మామూలువ్యక్తే అనుకున్నారు. అంబులెన్స్ వచ్చాక మొహంపై రక్తం తుడుస్తుండగా ప్రమాదానికి గురైంది తేజ్ అని గమనించారు. 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చేసరికే దెబ్బల తీవ్రతకు తేజ్ స్ఫృహతప్పాడు. ఆపస్మారక స్థితికి వెళ్లిపోయాడు. ప్రస్తుతం అపోలో ట్రీట్‌మెంట్‌కి నెమ్మదిగా కోలుకుంటున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com